మహిళ చైర్ పర్సన్ పై దాడి దుర్మార్గం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళ చైర్ పర్సన్ పై దాడి దుర్మార్గం..!
– అచ్చంపేటలో అరుణపై దాడి చేసిన వారిని శిక్షించాలి
– ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: అచ్చంపేట మార్కెట్ కమిటి చైర్ పర్సన్ అరుణపై రైతుల ముసుగులో దాడి చేయడం సహించరాని దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బాలేశ్వర్ గుప్త, తాండూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, సభ్యులు అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ అచ్చపేటలో ఆర్యవైశ్య మహిళ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ గా ఉన్న అరుణ కొనసాగడంపై కొందరు జీర్ణించుకోలేక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. తూకాలలో మోసం జరిగితే, గిట్టుబాటు ధర లభించకపోతే చైర్ పర్సన్, కార్యదర్శికి లిఖిత పూర్వకంగా చేయాలన్నారు.

అక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్ర యంత్రాంగం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాని మహిళ అని చూడ కుండా కొందరు రైతుల ముసుగులో దాడులకు పాల్పడడం పాశవిక చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చైర్ పర్సన్ అరుణపై దాడికి పాల్పడిన దోషులను వెంటనే శిక్షించాని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కోట మురళీ కృష్ణ, ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి దాదాపురం రవీందర్, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, సభ్యులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!