శ్రీ సాయి మేధలో వైభవంగా అక్షరాభ్యాసం
– పండితుల మంత్రోచ్చరణల మద్య వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వసంత పంచమిని పురస్కరించుకొని తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయం, షావుకార్పెట్ లోని ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య తల్లిదండ్రులు చిన్నారులకు భక్తిశ్రద్ధలతో అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం, వాక్కు, విద్య మొదలైన శక్తులే సరస్వతీ మాత అన్నారు. వాక్ సంపద సరస్వతీ మాత ఆరాధనతో సిద్ధిస్తాయన్నారు. సర్వ మానవాళికి అర్థం అయ్యే రీతిలో శ్లోక రూపంలో సామంపాతు సరస్వతీ అని మకుటం గల పది శ్లోకాలు భక్తిశ్రద్ధలతో ఆరు నెలలు పటిస్తే వాక్కు ప్రసన్నమై విద్యలో విజయం సాధిస్తారని తెలిపారు.

ఆంగ్ల మధ్యంలో విద్యాబోధన చేస్తున్నప్పటికీ విద్యార్థులకు దేశ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

