ఎల్ఆర్ఎస్ పై భగ్గుమన్న బీఆర్ఎస్..!
– ప్రజలను దోచుకునేందుకు కాంగ్రెస్ కుట్ర
– ఉచితంగా అమలు చేస్తామని మోసం
– రెండు నాల్కల సర్కారుపై బీఆర్ఎస్ పోరాటం
– ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్ఆర్ఎస్ పథకంపై ఇచ్చిన హామిని విస్మరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడికి పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రిసెండెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దర్నాలో నేతలు సర్కారుపై ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డమైన హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశ పెడితే నానా రాద్దాంతం చేసిందన్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తామని చెప్పిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ పథకంలో జిల్లా లోనే అత్యధికంగా తాండూరు మునిసిపాలిటీ నుంచే 13,197 దరఖాస్తులు రాగా తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల నుండి అత్యధికంగా 5 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఈ పథకం కింద ప్రభుత్వం ప్రజలను దోచుకునేందుకు ఫీజులను వసూలు చేస్తుందని మండిపడ్డారు. రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇచ్చిన హామి మేరకు ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్‌ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసలు రంగును ప్రజలు గుర్తిస్తున్నారని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలోని 420 హామీలు నేరవేర్చేవరకు పోరాటం తప్పదన్నారు. దర్నా అనంతరం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నేతలు తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటి మాజీ చైర్ పర్సన్ వీణ, బీఆర్ఎస్ పట్టణ మహిళ అధ్యక్షరాలు సంగీత ఠాకూర్, మాజీ అధ్యక్షురాలు అనురాధ, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, యాలాల మండల ధ్యక్షులు రవీందర్ రెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్లు ఉమా శంకర్, వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ ఫోరం నాయకులు సాయిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

