సొంతగూటికి చేరిన బాలేశ్వర్ గుప్త

తాండూరు రాజకీయం వికారాబాద్

సొంతగూటికి చేరిన బాలేశ్వర్ గుప్త
– బీజేపీలో చేరిన యాలాల ఎంపీపీ
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో చేరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం ఆయన బీజేపీ పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. మొదట్లో బీజేపీలో కొనసాగిన బాలేశ్వర్ గుప్త 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి వచ్చారు. పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో బాలేశ్వర్ గుప్త కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడీ తిరిగి సొంత పార్టీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బాలేశ్వర్ గుప్త ఆయన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, సీనీయర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, మనోహర్ రావు, పటేల్ విజయ్ కుమార్, రాజేందర్ రెడ్డి. విజయభాస్కర్ రెడ్డి, యు.రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!