కురుమలకు ప్రత్యేక కార్పోరేషన్ కావాలి
– తాండూరు ఎమ్మెల్యేకు సంఘం నేతల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కురుమల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కురుమ సంఘం నేతలు కోరారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ జనాభాలో కురుమలు 40శాతం వరకు ఉన్నారని ఎమ్మెల్యేకు వివరించారు. ప్రత్యేక గుర్తింపు లేకపోవడంతో విద్యా, వైద్యం, రాజకీయ రంగాలలో వెనుకబాటులో ఉన్నారని తెలిపారు. గొల్ల కురుమలు ఇంకా గొంగళ్లు నేసి, ఒగ్గు డోలు వాయిద్యాలతోనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
కురుమల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందిస్తూ డిమాండును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ కురుమ సంఘం అధ్యక్షులు నాగారం జగదీష్, ఉపాధ్యక్షులు పూజారి పాండు, జినుగుర్తి నర్సింలు, ఉల్లి నర్సింలు, వెంకటయ్య, సంఘం పెద్దలు శ్రీశైలం, మహేష్, శ్రీనివాస్, మాణిక్ రావు, మల్లేష్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

