థియేటర్లు బంద్..!
– నిలిచిపోనున్న సినిమా ప్రదర్శనలు
– 10 రోజుల పాటు విరామం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రేక్షకులకు ఆహ్లదాన్ని పంచే సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. నేటి నుంచి పది రోజుల పాటు సిని మాల ప్రదర్శనలు నిలిపివేయాలని థియేటర్ల యజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. ఈనెల 27వ తేదీ వరకు ఈ విరామం ఉంటుందని వారు వెల్లడించింది. పెద్ద సినిమాల విడుదల లేకపోవ డంతో పాటు చిన్న సినిమాలను ప్రేక్షకు లను ఆదరించడం లేదని భావించిన యజమాన్యాలు విరామాన్ని ప్రకటిం చారు. ఈనెల 30వరకు బంద్ కొనసాగే అవకాశాలు న్నాయి.
ఇదికూడా చదవండి…

