కాంగ్రెస్ గూటికి ఏకగ్రీవ సర్పంచులు
– శుభాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న సర్పంచులు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని లక్ష్మీనారాయణ పూర్ గ్రామ పంచాయతీ సర్పంచు అభ్యర్థిగా గుర్రాల నాగమణి ఒక్కరే నామినేషన్ వేయగా ఆమె ఎన్నిక ఏకగ్రీవం అవుతోంది. అదేవిధంగా తాండూరు మండలం చిట్టిగణపూర్ గ్రామపంచాయతీ సర్పంచు అభ్యర్థిగా పటేల్ విజయ్ కుమార్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. ఆయా గ్రామాల వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్నారు.

అయితే వారు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కనిపిస్తోంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో యాలాల మండలం లక్ష్మీనారాయణ పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుర్రాల నాగమణి కాంగ్రెస్ పార్టీ కండువాను వేసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిట్టిగణాపూర్ సర్పంచ్ అభ్యర్థికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చర్చనీయాంశ మైంది. ఏకగ్రీవ సర్పంచులకు గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భరోసా అందించారు.

ఇదికూడా చదవండి…

