గుట్కా స్థావరంపై దాడి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

గుట్కా స్థావరంపై దాడి
– రూ. 7.5లక్షల ప్యాకెట్ల స్వాదీనం
– నిందితులపై కేసు నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా సాగిస్తున్న గుట్కా స్థావరంపై వికారాబాద్‌ జిల్లా టాస్క్ ఫోర్స్, తాండూరు పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఆదేశాలతో తాండూరు పట్టణంలో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. దాడులు నిర్వహించి రూ. 7.5లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. ఈ మేరకు వ్యాపారిపై కేసు నమోదు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నవాబ్ పేట్‌లో నవాబ్ పేట్‌ పోలీస్టేషన్‌ పరిధిలో పీడీఎస్ బియ్యం రవాణపై దాడులు నిర్వహించి 14.4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు.

ఇదికూడా చదవండి…

బైపాస్ పరిహారం పెంచండి..!