పసుపు నీళ్లలో లాభాలు..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

పసుపు నీళ్లలో లాభాలు..!
– ఖాళీ కడుపుతో తీసుకుంటే మేలు
– గుండె, కాలేయం వ్యాధులకు చెక్
దర్శిని డెస్క్ : ప‌సుపులోని ఔష‌ద గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలుసు. అయితే ప‌ర‌గ‌డ‌పున ప‌సుపు నీళ్లు తాగ‌డం ద్వారా కూడా అనేక లాభాలు పొంద‌వ‌చ్చునని, ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. ప‌సుపులో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు శ‌రీరంలోని అనేక నొప్పుల నివార‌ణ‌కు ప‌నిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు ప‌సుపు నీళ్లు తాగ‌డం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ప‌సుపు నీళ్లలోని యాంటీ క్యాన్సర్ గుణాలు శ‌రీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.అంతేకాకుండా కాలేయ ఆరోగ్యానికి కూడా ప‌సుపు ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా పసుపు నీరు ఉపయోగపడుతుంది.

ఉదయమే పసుపు నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పసుపు నీటి వల్ల చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. ప‌సుపు నీళ్లు తాగ‌డం ద్వారా కొలెస్ట్రాల్ శాతం త‌గ్గి శ‌రీరంలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో స‌హాయ‌ప‌డుతుంది. కేన్సర్ లక్షణాలను తగ్గించడంలో కూడా పసుసు నీరు దోహదం చేస్తుంది. పసుపు నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పుసుపు నీరు తాగడం వల్ల మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అల్జీమ‌ర్స్ వ్యాధి బారిన‌ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునేందుకు ప‌ర‌గ‌డ‌పున ప‌సుపు నీళ్లు తాగడం అల‌వాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు.. ప‌సుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తాయి. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ప‌సుపు నీళ్లు తాగ‌డం వ‌ల‌్ల ర‌క్తాన్ని శుద్ధి చేసుకోవ‌చ్చు. త‌ద్వారా శ‌రీరంలో విషపదార్థాలను తొల‌గించి చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

(నోట్‌: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. )

ఇదికూడా చదవండి…

ఇరిగేషన్‌ శాఖలో టెన్షన్..!