వైభవంగా వరలక్ష్మీ పూజ

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా వరలక్ష్మీ పూజ
– శంకర్ యాదవ్ నివాసంలో సందడి
– పూజలో పాల్గొన్న దంపతులు
– హాజరైన ప్రజా ప్రతినిధులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో వైభవలక్ష్మీ పూజ వైభవంగా జరిగింది. మహిళలు తమ భర్త క్షేమంతో పాటు సౌభాగ్యం కోసం, కోరిన కోర్కెలు నెరవేరాలని వైభవలక్ష్మీ వ్రతం నిర్వహించడం హిందూ సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రావణమాసం రెండో శుక్రవారం తాండూరు పట్టణంలోని భావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో ఆయన సతీమణి చంద్రకళ వరలక్ష్మీ వ్రత పూజ నిర్వహించారు. ఈ పూజలో శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులు పాల్గొని వేద పండితులు విశ్వం పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బందుమిత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు హాజరు కావడంతో వారి ఇంట సందడిగా మారింది.

వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు మాజీ జెడ్పీటీసీ గౌడి మంజుల, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనీయర్ నాయకులు విజయ్ కుమార్ యాదవ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ చైర్ వైస్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, బాలప్ప, ప్రభాకర్ గౌడ్, చెంగోల్ మాజీ ఎంపీటీసీ రత్నమాల రాము, సన్నిహితులు అరవింద్,  సిరిగిరిపేట్ రాజ్ కుమార్, డి.మల్ రెడ్డి, సీనీయర్ న్యాయవాది కుర్వ శ్రీనివాస్, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాది పాశం రవికుమార్, సాహు లక్ష్మీకాంత్, బంటారం మాజీ ఎంపీపీ రాములు యాదవ్, ప్రేమ్ రాజ్,  సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప, జొన్నల వినోద్, బార్దాన్ ఉదయ్ శంకర్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దువచర్ల శ్రీనివాస్ రెడ్డి, పట్లోళ్ల మదన సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, చెంగోల్ గోపాల్, రఘునాధ్ రెడ్డి, అరవింద్ గౌడ్, కళ్యాణం చందు, సీనీయర్ పాత్రికేయులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, రవిశంకర్, యువనాయకులు రాము యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, భావనోళ్ల హనుమయ్య, జుంటుపల్లి అరవింద్ రెడ్డి తదితరులు కూడ పూజలో పాల్గొని దర్శించుకున్నారు.

ఇదికూడా చదవండి…

రేపు భూకైలాస్ లో శనీశ్వర పూజలు