రైతులకు శుభవార్త..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ వికారాబాద్ హైదరాబాద్

రైతులకు శుభవార్త..!
– పొలాల కంచె ఏర్పాటుకు ఆర్ధిక చేయూత
– 90శాతం రాయితీతో నిధుల మంజూరు
– దరఖాస్తులకు అర్హులు ఎవరంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా.. కోతులు, ఆవులు, ఎద్దులు, జింకల కారణంగా పంటలు పాడవుతూనే ఉంటాయి. విచ్చలవిడిగా పొలాల్లో తిరుగుతూ పంటను పాడు చేస్తుంటాయి. అలాంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు తమ పంటను కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. తారాబంది పథకం ద్వారా.. రైతులు తమ పొలాలు , తోటల చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి గ్రాంట్లు లను పొందవచ్చు.

ఈ పథకం ద్వారా మొత్తం 2555 మంది రైతులు తమ పొలాలకు ఫెన్సింగ్ కోసం గ్రాంట్స్ పొందుతారు. రైతులు తమ పొలానికి ఫెన్సింగ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అందులో 90 శాతం వరకు సబ్సిడీని పొందచవ్చు. ఒక వేళ ఫెన్సింగ్ ఖర్చు రూ.20,000 అయితే.. అందులో రూ.18 వేలు మీకు రియింబర్స్ మెంట్ రూపంలో వస్తుంది.. మిగిలిన రూ.2 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఫెన్సింగ్‌ ద్వారా రైతులు తమ పంటలను విచ్చలవిడి జంతువుల నుంచి కాపాడుకోవచ్చు.

అర్హులు, దరఖాస్తులు ఎలా అంటే…
అన్ని రకాల రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పథకం ప్రయోజనాలను పొందేందుకు, రైతు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి కావాల్సిన పత్రాలు.. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఫెన్సింగ్ వైర్ కోసం చెల్లించిన రశీదు వీటితో మీరు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి.. రైతు కనీసం 1.5 హెక్టార్ల భూమిని ఒకే చోట కలిగి ఉండటం అవసరం. దీని కంటే తక్కువ భూమి ఉన్నప్పటికీ.. 1.5 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రైతులతో కూడిన రైతు సమూహాలకు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక నిబంధన ఉంది. అదేవిదంగా షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలలో భూమి తక్కువ పరిమాణంలో ఉన్నందున, ఒకే చోట కనీసం 0.5 హెక్టార్ల భూమిని కలిగి ఉండటం అవసరం.

ఇదికూడా చదవండి…

వెల్లుల్లిలో మేలైన గుణాలు..!