గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

గణేష్ ఉత్సవాలకు ఏర్పాటు చేయండి
– మున్సిపల్ అధికారులకు హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు మున్సిపల్ అధికారులను హిందూ ఉత్సవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కమీషనర్ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ ఈనెల 7వ తేదిన తాండూరు పట్టణంలో వినాయక చవితి, 11వ తేది నిమజ్జన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి యేడాది మాదిరిగానే తాండూరు మున్సిపల్ నుంచి విద్యుత్, పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని కోరారు. మండపాల వద్ద పారిశుద్ధ్యం పనులు నిర్వహించాలని, రోడ్ల పై గోతులు ఏర్పడిన ప్రదేశాల్లో మరమ్మత్తులు చేయించాలని కోరారు.

ముఖ్యంగా నిమజ్జనం రోజున భద్రేశ్వర చౌరస్తాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు బిడ్కర్ రఘు, శ్రీకాంత్ రెడ్డి, సభ్యులు తాండ్ర నరేష్, మిర్చి వెంకట్, పరమేష్, కుమార్, నరేష్, రజక నర్సింహా తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

భజే.. ఆంజనేయం..!