కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ పరామర్శ

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ నేతకు ఎమ్మెల్సీ పరామర్శ
– కొమ్ము గోపాల్ రెడ్డి తల్లికి నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంకు చెందిన కాంగ్రెస్ నేత కొమ్ము గోపాల్ రెడ్డిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. బుధవారం మారేపల్లి కొమ్ము గోపాల్ రెడ్డి తల్లి కొమ్ము మణెమ్మ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్నమాజీ మంత్రివర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గోపాల్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్నారు. మాణెమ్మ దేహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు మనోదైర్యం తెలిపారు.

కార్యక్రమంలో కోట్ పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ జి. అంజయ్య, జనగాం విజయ్ కుమార్, డీ వై నర్సింలు, ఇందుర్ ప్రకాష్, మాజీ సర్పంచ్ పి. ప్రకాశం, శివానందం, మాజీ ఎంపీటీసీ యాలేటి శ్రీనివాస్, బందెప్ప, యువ నాయకులు బిర్కెట్ రఘు, ఆనంద్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు