ముదిరిన భూవివాదం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ముదిరిన భూవివాదం..!
– వివాదాస్పద భూమికి దొంగపత్రాలు
– భూమిని ఆక్రమించేందుకు కుట్ర
– కట్కం వీరేందర్ తరపు న్యాయవాది సంచలన వాఖ్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సర్వేనెంబర్ 5, 51లలోని భూ వివాదం ముదిరింది. వివాదాస్పద భూమిపై ఇరు వర్గాలు ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకున్నారు. హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని భూమిపై కట్కం వీరేందర్, అబ్దుల్ రజాక్ వర్గీయుల మద్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. గురువారం కట్కం వీరేందర్ తరుపున న్యాయవాది మనోహర్ రావు భూ వివాదంపై మీడియాతో మాట్లాడారు.

పట్టణంలోని సర్వేనెంబర్ 5, 51లలోని భూమికి అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తి యజమాని అయినప్పటికి ఆయన 1989లో సర్వేనెంబర్ 5 నుంచి విక్రయించిన భూమిని 2015లో కట్కం వీరేందర్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. కట్కం వీరేందర్ కొనుగోలు చేసిన సర్వేనెంబర్ 5లో ఉందని. అందుకు తగిన సేల్ డీడ్ పత్రాలు ఉన్నాయన్నారు. అయితే సర్వేనెంబర్ 51లోని భూమిపై ప్రత్యర్థులు అబ్దుల్ రహమాన్ నుంచి దొంగ జీపీఏ తీసుకున్నారని, నోటరీపై నమోదు సంఖ్య లేకుండా పత్రాలు రూపొందించారని ఆరోపించారు. కట్కం వీరేందర్ కు చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు ఆయన భూమి సర్వేనెంబర్ 51లో ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

దీంతో గత యేడాది జులైలో కట్కం వీరేందర్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులును పొందడం జరిగిందని, ఈ ఉత్తర్వులను కూడా పలుమార్లు పొడగించడం జరిగిందన్నారు. నిజానికి భూమి వారిదే అయితే 1989 నుంచి 2015 వరకు ఉన్న సేల్ డీడ్ లను ఎందుకు అడ్డుకోలేదని. ఇంజక్షన్ ఆర్డర్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. భూ వివాదం కేసు కోర్టులో ఉందని కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ లో చేసిన దరఖాస్తును కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. అయినప్పటికి చేసుకున్న దరఖాస్తుకు గడువు తీరిన తరువాత అమలయ్యే నిబంధన ప్రకారం నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.

ప్రస్తుతం వివాదాస్పద భూమిలో కట్కం వీరేందర్ కబ్జాలో ఉన్నారని, తగిన పత్రాలు కూడా ఉండడంతో భూమి ఆయనకే చెందుతుందని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టులో తేల్చుకుంటామని అన్నారు. మరోవైపు మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబేర్ లాల మాట్లాడుతూ ఈ భూ వివాదంలో కావాలని తాండూరు ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్ రెడ్డిపై లేని పోని ఆరోపణలు చె స్తున్నారని అన్నారు. ప్రజలలో వారికి ఆధరణ ఉందని అన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే వస్తారని అన్నారు. ఫ్యాక్టరీ నిర్వహిస్తూ 30 ఏండ్లుగా సేవ చేస్తున్నారని అన్నారు. ఓర్వలేక శ్రీనివాస్ రెడ్డి పేరును వివాదాల్లోకి తీసుకరావడం సమంజసం కాదని, ఇలాంటి వాఖ్యలు మానుకోవాలని సూచించారు. మరోసారి శ్రీనివాస్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కట్కం వీరేందర్ తో పాటు ఆయన కుటుంభీకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

విస్తృత సభ్యత్వ నమోదే బీజేపీ లక్ష్యం