మృతురాలి అంత్యక్రియలకు సాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతురాలి అంత్యక్రియలకు సాయం
– ఆర్థిక సాయం అందజేసిన డా.సంపత్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతురాలి అంత్యక్రియలకు తాండూరు బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ సాయం అందజేశారు. గురువారం తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన బోర సంగమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. గురువారం ఈ విషయం గ్రామ మాజీ ఎంపీటీసీ శాంతు, మాజీ ఉపసర్పంచ్ నక్కల జీవరత్నంలు డా. సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డా. సంపత్ కుమార్ స్పందించి కుటుంబానికి రూ.3వేల ఆర్థిక సాయం అందజేశారు. డా. సంపత్ కుమార్ తరుపున నాయకులు మృతురాలి కుటుంభీకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ మాజీ చైర్మన్ వడ్డె కృష్ణ, యువకులు రమేష్, కురువ లక్ష్మణ్, బ్యాంగరి వెంకటేష్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

డా.జయప్రసాద్ కు మహేందర్ రెడ్డి పరామర్శ