మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసిన విఠల్ నాయక్

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసిన విఠల్ నాయక్
– గాన్గాపూర్‌లో భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కలిశారు. గురువారం పౌర్ణమి సందర్భంగా గాన్గాపూర్ లో దత్తాత్రేయ స్వామిని విఠల్ నాయక్ దర్శించుకున్నారు. అదే సమయంలో దర్శనానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను విఠల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రితో కలిసి విఠల్ నాయక్ స్వామి వారిని దరి ంచుకున్నారు. మరోవైపు ప్రతీ పౌర్ణమి సందర్భంగా విఠల్ నాయక్ భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం కూడా పౌర్ణమిని పురస్కరించుకుని విఠల్ నాయక్ భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

వాల్మీకీ మహర్షికి జై..!