మనోహరన్న కృషితో మహర్దశ

తాండూరు రాజకీయం వికారాబాద్

మనోహరన్న కృషితో మహర్దశ
– రోడ్లకు రూ.227 కోట్ల మంజూరు హర్షం
– ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మసూద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గ రోడ్లకు మహర్దశ పట్టిందని కాంగ్రెస్ మైనార్టీ సీనీయర్ నాయకులు మసూద్ అన్నారు. సోమవారం హైదరాబాద్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గలోని అన్ని మండలాల రోడ్లకు రూ.227 కోట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికే దక్కిందన్నారు. అందుకు తగిన అధికారిక జీవోలు చూపించడం గర్వకారణమన్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చూపిన ప్రత్యేక చొరవతో బషీరాబాద్ కరణ్ కోట్ రోడ్డు (12 కిలోమీటర్లు)కు రూ.30 కోట్లు, మహబూబ్ నగర్ చించొలి మార్గంలోని ఫోర్ వే లైన్ (4 కిలోమీటర్లు)కు రూ.35 కోట్లు, తాండూరు వికారాబాద్ రోడ్డు (39 కిలో మీటర్లు)కు రూ. 101 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. అదేవిధంగా సీఆర్ఆర్(కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్) కింద నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, యాలాల మండలాల్లోని రోడ్లకు నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి రోడ్లతో సాధ్యమవుతుందని, రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పెద్దవేయడం పట్ల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఎమ్మెల్యేది అభివృద్ధి గేర్..!