ఉమాదేవి కృషి అభినందనీయం..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఉమాదేవి కృషి అభినందనీయం..!
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్
– గ్లోబల్ అవార్డు పొందడంతో సన్మానించి నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ హితం కోసం జ్యూట్ బ్యాగులు తయారుతో పాటు పలువురుకు ఉపాధి కల్పించడంలో ఉమాదేవి కృషి అభినందనీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. తాండూరు పట్టణంకు చెందిన ఉమాదేవి జ్యూటీఫై సంస్థ ద్వారా జ్యూట్ బ్యాగులు తయారు రంగంలో రాణించడం పట్ల గ్లోబల్ సంస్థ దేశ రాజధానిలో ఇన్స్పిరేషన్ వుమెన్ అవార్డును పొందిన సంగతి తెలిసిందే. సోమవారం యు.రమేష్ కుమార్, బీజేపీ నాయకులు ఉమాదేవిని కలిసి సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని ప్రధాని మోడి జ్యూట్ బ్యాగు వంటి సంస్థలను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఉమాదేవి చేస్తున్న కృషిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వృత్తి నైపుణ్యంలో ఇతరలకు ఉపాధి కల్పిస్తున్న ఉమాదేవిని, ఇందుకు ప్రోత్సహం అందిస్తున్నా ఆమె భర్త రాంచందర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, ఓబీసీ మోర్చ్ నాయకులు గాజుల శాంతుకుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మల్లేశ్ యాదవ్, పూజారి పాండు, కిరణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మరో ఆరుగురు పేకాట రాయుళ్లపై కేసు