ఇంట్లో టపాసుల మంట..!

క్రైం తెలంగాణ హైదరాబాద్

ఇంట్లో టపాసుల మంట..!
– భార్య, భర్తల మృతి, మరో యువతికి గాయాలు
– టపాసుల నిల్వ ప్రమాదంకు కారణంగా నిర్దారణ
– హైదరాబాద్‌ పాతబస్తీలో ఘటన 

హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇంట్లో నిల్వ ఉన్న టపాసుల నిల్వ నుంచి అగ్ని ప్రమాదం ఏర్పడడంతో భార్య, భర్తలు మృతి చెందారు. మరో యువతికి గాయాలు కాగా పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన హైదరాబాద్‌ పాతబస్తి యాకుత్ పురాలో జరిగింది. కాలనీకి చెందిన ఉషారాణి, మోహన్‌ లాల్‌లో బాణాసంచా దుకాణం నిర్వహిస్తున్నారు. దుకాణం వేసి వేయగా వాటిని ఇంట్లో నిల్వ ఉంచారు. ఇంట్లో పిండి వంటలు చేస్తున్న సమయంలో వాటికి నిప్పు అంటుకుంది. ఇంట్లో నిలువ ఉంచిన టపాసులతో పాటు సిలిండర్ బ్లాస్ట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగేసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మోహన్ లాల్, ఉషారాణీలు గాయపడ్డారు. మరో యువతి కూడా ప్రమాదంలో చిక్కుకుంది.

అప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంటి లోపల చిక్కున్న ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేశారు. ఏగేసి పడుతున్న మంటల్లో అతి కష్టం మీద ఇంట్లో ఉన్న ముగ్గురిని బయటకి తీసి ఆంబులెన్స్‌లో వేసుకొని ఉస్మానియాకి తరలించగా వైద్యుల పరీక్షలు అనంతరం మోహన్ లాల్, ఉషారాణి దంపతులు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. శృతి గుప్తా అనే యువతి తీవ్ర గాయాల పాలై చావు బతుకుల మధ్య ఉండటంతో ఉస్మానియా నుంచి మలక్ పేట్ యశోద హాస్పిటల్ కి తరలించారు ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఇంట్లో పిండి వంటలు చేస్తున్న సమయంలో వాటికి నిప్పు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి…

తెలంగాణ ఐఏఎస్‌లకు స్థాన చలనం