బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయండి
– అంత్యక్రియలకు పడరాని కష్టాలు
– మౌళిక సదుయాపాలు లేక ఇబ్బందులు
– తాండూరు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసిన రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటికను అభివృద్ది చేయాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందకూరి రాజ్ కుమార్ కోరారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని బీసీ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తాండూరులోని బీసీ స్మశాన వాటిక ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు. స్మశాన వాటికలో సరైన వసతులు, సదుపాయాలు లేక అంత్యక్రియలకు వచ్చే వారికి అనేక అవస్థలు ఎదురవుతున్నాయని వివరించారు.
స్మశాన వాటికలో ప్రజలు మూత్ర విస్మర్జన చేస్తుండడంతో దుర్గందభరితంగా మారిందని అన్నారు. గత ఆరు సంవత్సరాల క్రితం మున్సిపల్ చైర్ పర్సన్ సునీత సంపత్ ఉన్నప్పుడు 14 ఫైనాన్స్ ప్లాన్ కింద రూ. 65 లక్షలు నిధులు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదని, ఆ తరువాత జిల్లా కలెక్టర్ కూడా స్మశాన వాటిక అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించిన పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా ప్రత్యేక చొరవ తీసుకుని బీసీ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ సుకుర్, జిల్లా బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, యాలాల్ మండల అధ్యక్షులు లక్ష్మణ చారి, తాండూర్ మండల అధ్యక్షులు బసంత్, బీసీ యువ నాయకులు రామ ముదిరాజ్, రమేష్, మత్స్య సహకార సంఘం చైర్మన్ శ్రీధర్, ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు వేణు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

