రాబోయేది బీసీల రాజ్యాధికారమే..!
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావడం ఖాయం
– బీసీ సంఘం జా. కార్యదర్శ సభ్యులు కె. రాజ్ కుమార్
– బీసీల సమరభేరికి తరలివెళ్లిన సంఘం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారం సాధించడం ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీల సమరభేరీ సభకు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఆర్.కృష్ణయ్య చేస్తున్న పోరాటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావడం ఖాయమన్నారు. అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం తప్పక వస్తుందన్నారు. ఇందుకోసం బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు.
మరోవైపు బీసీల సమరభేరి సభకు తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అన్ని పార్టీలకు చెందిన నాయకులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా మహిళ నాయకురాలు, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, నరేందర్, బంసత్ కుమార్, శ్రావణ్ కుమార్, మహిళ నాయకులు అనిత, మంజుల, నర్సమ్మ, నాయకులు రాము ముదిరాజ్, రమేష్, పరవేష్, బాబా గౌడ్, శంకర్, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, యువ నాయకులు దుబాయ్ వెంకట్, శివ, మన్నన్, ప్రకాష్ గౌడ్, నగేష్, అంబదాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి….

