మిస్సింగ్‌పై ఫోకస్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మిస్సింగ్‌పై ఫోకస్..!
– బాలిక కోసం ప్రత్యేక బృందాలు
– దర్యాప్తులో పోలీసులకు లీడ్..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్‌ కోట్ గ్రామంలో మిస్సింగ్ అయిన బాలిక కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. కరణ్‌ కోట్‌ గ్రామానికి చెందిన లాలమ్మ మనుమరాలు స్వాతి(9) ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైంది. కాగా బాలిక కిడ్నాప్‌ కావడంతో అదృశ్యమైనట్లు గ్రామంలో పుకార్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ కరణ్‌ కోట్ విఠల్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. బాలికను గుర్తించడం కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బాలికను ఎత్తుకెళ్లినట్లు సమాచారం అందించిన వారిని కూడా విచారించారు. లాలమ్మ ఫిర్యాదు అందించిన రెండో రోజూ కూడా విచారణ జరిపారు.

ఈ విచారణలో పోలీసులకు ఒక లీడ్ అందింది. ఇంటి నుంచి వెళ్లిన బాలిక స్వాతి అదృశ్యమైన రోజు 10 గంటల ప్రాంతంలో కర్ణాటక నుండి వచ్చే బస్సు(KA 32F1915)లో ఎక్కినట్లు గుర్తించారు. అక్కడి నుంచి బస్సులో వెళ్లిన బాలిక తాండూరులో మల్లప్ప మడిగ అనే ప్రాంతంలో దిగినట్లు ఆ బస్సు కండక్టర్ ద్వారా తెలుసుకున్నారు. అయినా బాలిక ఆచూకీ లభించలేదు. కావున మిస్సింగ్ అయిన పాప స్వాతి ఎవరికైనా తెలిస్తే తాండూరు డీఎస్పీ సెల్: 8712670017, కరణ్ కోట్ ఎస్ఐ సెల్: 8712670052లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమ్మాయి గుండుతో ఉందని వివరాలను తెలిపారు.

ఇదికూడా చదవండి…

బాలాజీ నగర్ లో తీరిన రోడ్డు కష్టాలు..!