ఇంటేగ్రేట్ స్కూల్‌కు ముహుర్తం ఖరారు..!
– తాండూరుకు రానున్న స్పీకర్, హెల్త్ మినిస్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంకు మంజూరు చేసిన యంగి ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంకు మూహుర్తం ఖరారయ్యింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేనెల 6న శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాలు హజరవుతున్నట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు తాండూరు నియోజకవర్గానికి ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు కావడం… శంకుస్థాపనకు ముహుర్తం కూడా నిర్ణయించడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంటిగ్రేటేడ్ స్కూల్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనేది స్పష్టత రాలేదు.
ఇదికూడా చదవండి…

