వామ్మో.. ఆర్‌ఎంపీలు..!

ఆరోగ్యం క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వామ్మో.. ఆర్‌ఎంపీలు..!
– దాడులు చేసిన ఆగని దందాలు
– తాండూరులో 7 మందిపై కేసులు
– హాట్‌ టాపిక్‌గా మారిన వైనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో ఆర్ఎంపీ వైద్యుల గురించి మాట్లాడితే వామ్మో అంటున్నారు. అర్హత లేకున్నా అంతకుమించి వైద్య సేవలు అందిస్తుండడమే ఇందుకు కారణం. ఆర్ఎంపీలుగా ఉండి వైద్యం చేస్తూ డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ఆర్ఎంపీ వైద్యులు కేవలం ఫస్ట్ ఏయిడ్ సెంటర్ అనే బోర్డులను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని నిబంధనలు ఉండగా దానికి విరుద్దంగా క్లీనిక్‌లు ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తున్నారు. దీంతో పాటు డాక్టర్ అనే పేరును వాడుకుండూ ప్రిస్ర్కిష్షన్లు రాస్తున్నారు. ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ వైద్యం పేరుతో అందినంత దోచుకుంటున్నారు.

తాండూరులోని ఓ క్లీనిక్‌లో ఆర్ఎంపీ వైద్యులు వృద్ధురాలుకు ఇంజక్షన్‌ ఇవ్వడంతో ఆమె కాలు చచ్చుబడి పోయాయి. బాధిత కుటుంభీకులు కలెక్టర్, వైద్యాధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతనెలలో మెడికల్ కౌన్సిల్ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్ఎంపీల డాక్టర్ల బాగోతం బయట పడింది. ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని ఆర్ఎంపీలు మోత్తం నాయకుల చుట్టు ప్రదక్షణలు చేయడం చర్చనీయాంశమైంది. అధికారులు దాడులు చేసినప్పటికి ఆర్ఎంపీ వైద్యులు దందాలను ఆపడం లేదు. ఈ క్రమంలో తాండూరులో పోలీసులు అర్హత లేకుండా వైద్య సేవలను అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యులపై కేసులు నమోదు చేశారు.

పాషా ఫస్ట్ ఏయిడ్ సెంటర్‌కు చెందిన ఇస్మాయిల్ పాష, పీపుల్స్ మెమోరియల్ ఫస్ట్ ఏయిడ్ సెంటర్‌కు చెందిన మన్సూర్ షేక్, లక్ష్మణ్‌ రావు ఫస్ట్ ఏయిడ్ సెంటర్‌కు చెందిన సునీత్‌ కుమార్, శ్రీ బాలాజీ ఫస్ట్ ఏయిడ్ సెంటర్‌కు చెందిన గణపతిరావు, విజయ క్లీనిక్‌కు చెందిన ఎం.సాల్మాన్, యూసుఫ్‌ ఫస్ట్ ఏయిడ్ సెంటర్‌కు చెందిన ఎండీ మౌలానా, రక్షిత పాలి క్లీనిక్, రెడ్డి క్లీనిక్‌కు చెందిన పి.సురేందర్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన ఆర్ఎంపీ అసోసియేషన్లో కలవరం రేపింది. ఆర్ఎంపీలపై కేసులు కాకుండా చూసేందుకు బడాబాబులు ప్రయత్నించారని ఆరోపణలు రావడం తాండూరులో హాట్‌ టాఫిక్‌గా మారింది. నకిలీ వైద్యం చేస్తూ.. దొరికితే తప్పించుకునేందుకు ఆర్ఎంపీలు చేస్తున్న ఎత్తుగడలపై ప్రజలు అంతా వామ్మో అంటూ ఆందోళనకు గురవుతున్నారు.

ఇదికూడా చదవండి…

ఇంటేగ్రేట్‌ స్కూల్‌కు ముహుర్తం ఖరారు..!