కార్తీక శోభ..!
– తుల్జా భవాని దేవాలయంలో దీపోత్సవం..!
– పాల్గొన్న కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి వార్డు నెంబర్ 24లోని తుల్జాభవాని దేవాలయంలో కార్తీక శోభ సంతరించుకుంది. శుక్రవారం దేవాలయంలో కార్తీక దీపోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తుల రంగవళ్లులు ఆకట్టుకున్నాయి. శివున్ని ఆర్థనారీశ్వరుడి చిత్రం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ వార్డు మహిళలతో కలిసి పాల్గొన్నారు. దేవాలయంలో కార్తీక దీపాలను వెలగించారు. కార్తీక దీపాల వెలుగులో దేవాలయం వెలిగిపోయింది. భక్తుల సందడితో ఆలయం మొత్తం కార్తీక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో విజయ రామారావు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

