ఘనంగా లక్ష్మణ్ చారి జన్మదినం
– జుంటుపల్లి దేవాలయంలో వేడుకలు
– స్కూల్, అంగన్ వాడి విద్యార్థులకు పలకల పంపిణీ
– హాజరైన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం యాలాల మండల అధ్యక్షులు, చెన్నారం గ్రామానికి చెందిన లక్ష్మణ చారి జన్మదిన వేడుకలు పండగలా ఘనంగా జరిగాయి. శనివారం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని జుంటిపల్లి శ్రీ సీతారామ దేవస్థానం ఆవరణలో కుటుంబ సభ్యులు, మండల నాయకుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. బర్త్ డే సందర్భంగా చెన్నారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, అంగన్ వాడి స్కూల్లోని విద్యార్థులకు పలకలు, పెన్సిల్లు, లబ్బర్లు పంపిణీ చేశారు. సీతారామ స్వామి దేవాలయంలో జరిగిన వేడుకలకు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెఇపారు.

అదేవిధంగా యూత్ కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, తెలంగాణ ఉద్యమ కారుడు ప్రకాష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, జుంటుపల్లి ఆలయ చైర్మన్లు హనుమంతరావు, అరవిందరావు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచులు వెంకట్రెడ్డి, వెంకటప్ప, దేవనూర్ ఆకుల శివకుమార్, మండల నాయకులు మన్నన్, బషీరాబాద్ మండల అధ్యక్షులుబీసీ సంఘం నరేందర్ ముదిరాజ్, అక్కంపల్లి ఉద్యర మల్లప్ప, నరేందర్, గ్రామ పెద్దలు వడ్ల నర్సింలు, చెన్నారం ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీకాంతరావు, శివకుమార్, శంకర్, సుమలత, యాలల మండలం బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ గౌడ్, అభిలాష్, రవీందర్ నరేష్, మహిపాల్, శేఖర్, అశోక్ తదితరులు కూడా లక్ష్మణ్ చారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అనునిత్యం అన్నింటిలో నేనున్నా అని ముందుండే బీసీ నాయకులలో లక్ష్మణ్ చారి అని కొనియాడారు. మునుముందు ఉన్నత పదవులు పొంది ప్రజాభిమానంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఇదికూడా చదవండి…

