రేగు పళ్లు.. ఆరోగ్యానికి మేలు…!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

రేగు పళ్లు.. ఆరోగ్యానికి మేలు…!
– పుష్కలంగా ఐరెన్ కంటెంట్
– హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచే పోషకాలు
– తింటే ఎముకల బలోపేతం
దర్శిని డెస్క్‌ : రేగు పళ్లు.. అంటే అందరికి ఇష్టమే. శీతాకాలంలో ఈ పళ్లు విరివిగా లభిస్తాయి. ఎవరికైనా నోరూరించే ఈ పళ్లు, వాటి ఆకారం చూస్తే తినాలనిపించక మానదు. విటమిన్ ఎ, సి, మినరల్ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండే ఈ పళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని తినడం వల్ల కండరాలు, నాడీ వ్యవస్థ, చర్మానికి అవసరమైన అనేక పోషకాలు అందిస్తుంది. రేగిపళ్లలో పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
రక్తహీనతను తగ్గిస్తుంది.

రేగిపళ్లలో విటమిన్ సి వల్ల చర్మానికి మరింత మెరుపును అందించడంలో సహాయపడుతుంది. మొటిమల నుండి కూడా రక్షిస్తుంది. ఈ పండును పేస్ట్‌గా చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల గాయం మానడంతో పాటు చర్మం మృదువుగా మారుతుంది. ఈ పండులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్‌ ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

ఇందులో యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్స్, పాలీశాకరైడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్‌లు కూడా ఉంటాయి. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. అంతే కాకుండా ఇందులో బ్లడ్ షుగర్ తగ్గించే గుణాలు ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ పళ్లు ఆస్టియో ఆర్థరైటిస్‌ను నివారిస్తాయి.అలాగే ఈ పండులో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ఇదికూడా చదవండి…

మా కౌన్సిలర్‌పై అబాండాలు వేయోద్దు…!