స్త్రీలు దేవతలతో సమానం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్త్రీలు దేవతలతో సమానం..!
– సనాతన ధర్మంలో కుల జాతి బేధాలు లేవు
– వేద విజ్ఞానం స్త్రీ, పురుషులకు సిద్దించింది
– ముత్తదువల పాదపూజలో స్వామీజీలు
– దళిత మహిళలకు పాదపూజ చరిత్రలో తొలిసారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సృష్టిలో స్ట్రీలు దేవతలతో సమానమని.. సనాతన ధర్మంలో కుల, జాతి బేధాలు లేవని.. పలువురు ప్రఖ్యాత స్వామీజీలు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్లో శ్రీ మాణికేశ మహాసంస్థానము పీఠాధిపతి, తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీశ్రీ శంకర్ స్వామిజీ ఆధ్వర్యంలో చరిత్రలో ప్రపథమంగా దళిత సామాజిక వర్గానికి చెందిన 108 మంది సువాసీనుల(ముత్తదువులు)కు పాదపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగాపురం శ్రీ లక్ష్మీనారాయణ ఆశ్రమం స్వామీజీ పరమాత్మనందగిరి స్వామీ, నిజామాబాద్ నిర్మలానంద స్వామీ, భద్రాచలం విశ్వత్మానందగిరి స్వామీ, శ్రీశైలం మౌనస్వామి ఆశ్రమం శివస్వామి, దండోతి జయశ్రీ మాతాజీ, గుల్బర్గా ప్రభు శ్రీ తాయి మాజీలు హాజరయ్యారు.

వారి సమక్షంలో శంకర్ స్వామి ముత్తదువలకు పాదపూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్వామీజీలు మాట్లాడుతూ సనాతన ధర్మం సమానత్వాన్ని సూచిస్తుందన్నారు. సనాతన ధర్మంలో కుల, జాతి బేధాలు లేవని.. వేద విజ్ఞానం స్త్రీ, పురుషులకు సమానంగా దక్కిందని అన్నారు. ఎలాంటి వివక్షలకు తావులేకుండా జీవించాలన్నారు. అదేవిధంగా స్త్రీలను దేవతా స్వరూపులుగా కొలవాన్నారు. అదేవిధంగా కార్యక్రమంలో గోపూజ, యజ్ఞాలు నిర్వహించి అన్నదానాలు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్ఎస్ఎస్ సభ్యులు భాగయ్య, విహెచ్పీ సభ్యులు దేవ్ జీ రావత్, రామారాజు, జీవీఎస్కే గ్రూప్ ప్రతినిధి డా. కిశోర్ కుమార్, త్యాగరాజు బంటు వీరరాఘవరెడ్డి, ఐవీఎఫ్ తెలంగాణ సెక్రటరీ డా.రొంపల్లి సంతోష్ కుమార్, హిందూ ధార్మీకులు, ఆధ్యాత్మిక ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

పురుగుల మందు తాగి… సెల్‌ టవర్ ఎక్కి..!