ఆక్రమిత కలుపు మొక్కలతో జీవ వైవిద్యంకు నష్టం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆక్రమిత కలుపు మొక్కలతో జీవ వైవిద్యంకు నష్టం
– వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ కు ఈకోఫాన్ విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆక్రమిత కలువుపు మొక్కల వల్ల జీవ వైవిద్యానికి దుష్ర్పరిణాలు కలిగి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కు ఈకోఫాన్ సంస్థ కోరింది. సోమవారం తాండూరు కార్యాలయంలో చైర్ పర్సన్ ను కలిసి సంస్థ ప్రతినిధి మెట్టు సాయి సంపత్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆక్రమిత కలుపు మొక్కలు విచ్చల విడిగా పెరిగి పోతున్నాయన్నారు. వాటి వల్ల నేల, నీరు, జీవ వైవిద్యం, ఆహార భద్రత, ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నాయన్నారు. తాండూరు పట్టణంలోని విద్యా సంస్థలతో పాటు ఇతర ప్రాంతాల్లో కలుపు మొక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులతో, ప్రజలతో శ్రమదాన కార్యక్రమాలను ఉద్యమంగా చేపట్టి నివారణలో భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నవీన్ కుమార్, తలారి ప్రభాకర్, అభిషేక్, ద్యావరి శ్రీనివాస్, నరేష్, శివకుమార్, రాజశేఖర్, మహమ్మద్ సలీం, షా పైసల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కృష్ణ కుమార్