ఇంటికి చేరుకున్న సమీర్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటికి చేరుకున్న సమీర్..!
– వికారాబాద్‌లో గుర్తించిన కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. వికారాబాద్‌లోని రైల్వే స్టేషన్ వద్ద బాలున్ని గుర్తించి ఇంటికి తీసుకవచ్చారు. తాండూరు మున్సిపల్‌ పరిధి పాత తాండూరుకు చెందిన మొహమ్మద్ ఫెరోజ్ కొడుకు మొహమ్మద్ సమీర్(14) బుధవారం ఇంటి వద్ద ఉన్న మసీదులో నమాజ్ చదివేందుకు వెళ్లి అదృశ్యమైన సంగతి తెలిసిందే. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. తెలిసిన వారి వద్ద, చుట్టుపక్కలా విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

మీడియాలో ప్రకటనలు కూడా చేశారు. అయితే బాలుడు అదృశ్యమైన సమయంలో సీసీ పుటేజీలను గమనించిన బాలుడు తాండూరు రైల్వేస్టేషన్‌ చేరుకున్నట్లు గుర్తించారు. దీంతో కుటుంభీకులు ఆయా ప్రాంతాల్లో గాలించుకుంటూ వెళ్లే క్రమంలో గురువారం రాత్రి బాలుడు సమీర్ వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద గుర్తించారు. వెంటనే బాలున్ని ఇంటికి తీసుకవచ్చారు. కాగా బాలుడు ఇంటి నుంచి వెళ్లిన కారణాలను వెల్లడించలేదు. తనకేమి గుర్తులేదని, ఎలా వెళ్లానో కూడా తెలియదని వాపోయాడు. బాలుడు ఇంటికి చేరుకోవడంతో కుటుంభీకులు పోలీసులకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

సమీర్ ఘర్ ఆజా బెటా…!