మున్సిపాల్టీలకు స్పెషల్ బాసులు…!
– ప్రత్యేక అధికారుల నియమకాలకు ఉత్తర్వులు
– జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీలకు స్పెషల్ బాసులు వచ్చేశారు. పదవి కాలం ముగిసిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ‘ప్రత్యేక’ పాలనలోకి వెళ్లాయి. ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. రాష్ట్రంలో 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరగ్గా అదేనెల 27వ తేదీన పాలకమండళ్లు కొలువుతీరాయి. దీంతో ఆదివారం ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదికూడా చదవండి…

