త్వరలో తాత్కాళిక ప్రెస్ భవన్..!
– టీయూడబ్ల్యూజే ఐజేయూతో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం
– రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి
– యూనియన్లో కొత్తగా చేరిన 143 యూనియన్ జర్నలిస్టులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : త్వరలో తాండూరులో తాత్కాళిక ప్రెస్ భవన్ అందుబాటులోకి తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని టీయూడబ్ల్యూజే- ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారిలు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్ లో టీయూడబ్ల్యూజే- ఐజేయూ తాండూరు డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణల ఆధ్వర్యంలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, క్రమశిక్షణ విభాగం రాష్ట్ర సభ్యులు వెంకటేశం(వాసు)లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో జర్నలిస్టులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రెస్ భవన్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే తాత్కాళిక భవన్ ను అందుబాటులోకి తీసుకరావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తాండూరు జర్నలిస్టుల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి, రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. అంతేకుండా తాండూరులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ప్లాట్ విషయంపై కూడా చొరవ చూపుతామన్నారు. ఫిబ్రవరి 10లోపు సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని, ఆ తరువాత కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అంతకుముందు తాండూరు డివిజన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణలు మాట్లాడుతూ తమ పదవి కాలంలో జర్నలిస్టులకు యూనియన్లకు ఆతీతంగా ఆరోగ్య బీమా, జర్నలిస్టుల పిల్లలకు ఫీజులలో 50శాతం రాయితీ కల్పించడం జరుగుతుందని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో పదవిలో ఉన్నా లేకున్నా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తామన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే 143 యూనియన్ కు చెందిన జర్నలిస్టులు శివానంద్ సింగ్, గోపాల్, ముక్తార్, కృష్ణ, నరె ష్, మునీర్, అలీం తదితరులు ఐజేయూ యూనియన్ సభ్యత్వం తీసుకున్నారు.
సభ్యత్వ నమోదుకు ఆర్థిక సాయం
మరోవైపు టీయూడబ్ల్యూజే – ఐజేయూలో జర్నలిస్టుల అందరి సభ్యత్వానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇదివరకు ఉన్న సభ్యుల సభ్యత్వ రెన్యువల్, కొత్త సభ్యుల సభ్యత్వ రుసుమును మొత్తం చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల సీనీయర్ జర్నలిస్టులు సంగమేశ్వర్, వెంకట్రామ్ రెడ్డి, శాంతు, రమే ష్, వెంకటేష్, బషీరాబాద్ మండల సీనియర్ జర్నలిస్టులు రాంరెడ్డి, శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, పెద్దేముల్ మండల సీనీయర్ జర్నలిస్టులు గౌస్, గయాజ్, తాండూరు పట్టణ సీనియర్ జర్నలిస్టులు మఠం నిరంజన్, మహేష్, లిట్టు(నరేందర్), గోపాల్, శ్రీను, కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వంశీ, ప్రశాంత్, రాందాస్, నర్సింలు, ఆయా మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

