బీసీల ఉద్యమంలో మహిళలే కీలకం కావాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీల ఉద్యమంలో మహిళలే కీలకం కావాలి
– బీసీ సంఘం పెద్దేముల్ అధ్యక్షురాలుగా కుర్వ శివలీల
– నియామకపత్రం అందించిన జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం కావాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. గురువారం బీసీ సంఘం పెద్దేముల్ మండల అధ్యక్షురాలుగా రుక్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శివలీలను నియమించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ తో పాటు జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారీలు శివలీలకు నియామకపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో బీసీలు పటిష్టంగా ఉండడం ఎంతో అవసరమన్నారు. బీసీల హక్కుల సాధనకు సాగిస్తున్న ఉద్యమంలో మహిళలు కూడా కీలకంగా నిలవాలన్నారు.

బీసీ సంఘం నుంచి పెద్దేముల్ మండల అధ్యక్షురాలుగా నియామకమైన శివలీల బీసీ మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామాల్లో కమిటీలను నియమించాలన్నారు. అదేవిధంగా అధ్యక్షురాలుగా నియామకమైన శివలీల మాట్లాడుతూ తనపై నమ్మకంతో డివిజన్ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం పట్ల జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, రాజ్ కుమార్ లకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రావణ్ కుమార్, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు అనిత, బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమణి, లక్ష్మీ, నర్సమ్మ, మంజుల, విజయలక్ష్మీ, పోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, జుంటుపల్లి వెంకట్, కుర్వ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వదినమ్మే.. చంపించింది…!