మహిళలకు స్ఫూర్తి నవనీత

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళలకు స్ఫూర్తి నవనీత
– ఇంటర్నేషనల్ పోటీలో రాణించాలి
– మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇష్టమైన రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు జాతీయ క్రీడాకారిణి నవనీత స్ఫూర్తిగా నిలవడం అభిందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. తాండూరు పట్టణం ఇందిరానగర్ 5వ వార్డుకు చెందిన నవనీత గత నెల జనవరి 31 నుంచి ఈనెల 2వ తేది వరకు కేరళలోని త్రిశూర్ లో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ -2025 జాతీయ స్థాయి పోటీలో 35 నుంచి 40 ఏండ్ల మహిళల విభాగంలో పోటీలో పాల్గొంది. అక్కడ జరిగిన హై జంప్ పోటీలో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది.

ఈ నేపథ్యంలో నవనీత త్వరలో ఇండోనేషియలో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైంది. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంటకయ్య నవనీతను తన నివాసంలో శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పెళ్లయి.. ఓ వైపు పీటీ టీచర్ గా పనిచేస్తూ జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటి ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైన నవనీత కృషిని అభినందించారు.

నేటి మహిళలు అనుకున్న రంగాల్లో రాణించేలా నవనీత వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కొనియాడారు. మహిళలు అనుకుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు. ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైన నవనీత అంతర్జాతీయ స్థానిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

టీయూడబ్ల్యూజే ఐజేయూలోకి సీనీయర్ పాత్రికేయులు