ఇ-శ్రామ్ కార్డు ఆప్లై ఈజీ..!
– ఇది ఉంటే ఫ్రీగా రూ. 2లక్షల బీమా
– మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు
– ఎలా దరఖాస్తు చేసుకోవాంటే..?
దర్శిని డెస్క్ : అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్ కార్డులను అందిస్తోంది. ఈ కార్డును కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ఆటో డ్రైవర్లు, డ్రైవర్లు, పంక్చర్ రిపేర్లు, గొర్రెల కాపరులు, పాల యజమానులు, పశువుల పెంపకందారులు, పేపర్ హాకర్లు, జొమాటో, స్విగ్గీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటి డెలివరీ బాయ్‌లు ఇ-శ్రామ్ కార్డులు పొందవచ్చు. అయితే వీరికి ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు. ఏళ్ల తరబడి అదే పని చేస్తున్నా గ్రాట్యుటీ అంటేనే వీళ్లకు తెలియదు.
అటువంటి శ్రమ జీవుల భవిష్యత్తు భద్రత కోసం, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్ కార్డు పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కేంద్రం ఇ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రకటించిన తర్వాత ఎలా నమోదు చేసుకోవాలి ? అని అందరికి సందేహాలు ఏర్పడ్డాయి. ఇ-శ్రామ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా చేయవచ్చు. గిగ్ కార్మికులు e-Shram పోర్టల్ https://eshram.gov.in/ ని సందర్శించడం ద్వారా తమను తాము నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత వారికి కార్డు కూడా అందిస్తారు.
ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలంటే..?
e-Shram పోర్టల్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ముందుగా eshram.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు మీరు “eShram లో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు EPFO లేదా ESIC సభ్యుడా అనే ప్రశ్న అడుగుతారు, దానికి సమాధానం ఇవ్వండి. ఇప్పుడు “Send OTP” పై క్లిక్ చేసి మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. తరువాత మీ 14 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి నిబంధనలు, షరతులపై టిక్ చేయండి. ఇప్పుడు “సమర్పించు” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఒక కొత్త ఫారమ్ తెరవబడుతుంది. అందులో మీ పుట్టిన తేదీ, చిరునామా, విద్య మరియు బ్యాంక్ వివరాలను పూరించండి.
అన్ని సమాచారాన్ని జాగ్రత్తగా తనిఖీ చేసి, సమ్మతి అనే ఆప్షన్‌పై టిక్ చేసి మళ్ళీ సమర్పించండి. ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ కూడా తీసుకోవచ్చు.
ఇ-శ్రమ్ కార్డ్ ప్రయోజనాలు
ఈ కార్డు తీసుకున్న కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై పాక్షిక వికలాంగులుగా మారితే కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష చెల్లిస్తుంది.
అదే శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు రూ. 2 లక్షలు బీమా కవరేజీ బాధిత కుటుంబానికి లభిస్తుంది.
ఇ-శ్రమ్ కార్డు ద్వారా కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పని ముట్లు, కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు అందుకునే అవకాశం ఉంది.
ఇదికూడా చదవండి…

