రక్తదానం అభినందనీయం..!
– శివాజీ స్పూర్తితో యువత ముందుకు సాగాలి
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి రోజున యువత రక్తదానం చేయడం అభినందనీయమని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం చత్రపతి శివాజీ మహరాజ్ 395వ జయంతి సందర్భంగా తాండూరు హిందూ వాహినీ ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌరస్తాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మపరిక్షణతో పాటు పరమత రక్షణకు శివాజీ మహారాజ్ ఎంతో కృషి చేశారని అన్నారు.
సమాజ హితం కోసం కృషి చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో యువత రక్తదానానికి ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. శివాజీ మహరాజ్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు బిడ్కర్ రఘు, జగదీశ్వర్, ప్రవీణ్, హిందూ వాహినీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

