పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..!
– సీఎం, ఎమ్మెల్యే సహకారంతో కొత్త రేషన్ కార్డులు
– అర్హులైన లబ్దిదారులకు బియ్యం పంపిణీ
– అంతారంలో కొత్త లబ్దిదారులకు పంపిణీ షురూ
తాండూర రూరల్, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని తాండూరు మండలం కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని అంతారం గ్రామంలో కొత్తగా రేషన్ కార్డుల లో పేర్లు నమోదు అయిన లబ్దిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించారు.

తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, డైరెక్టర్ కరీం, పీఏసీఎస్ డైరెక్టర్ పెండా నర్సింలు, గ్రామ పెద్దలు వడ్డె చంద్రయ్య, కోస్గి ఆశన్న, దస్తగిరిపేట్ బీజే శ్రీనివాస్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ప్రకాష్, జంగని మొగులప్ప, ముస్తాఫ్, పెండా దేవదానం, ఎల్. రాజేందర్ రెడ్డి తదితరులు కొత్త లబ్దిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామి మేరకు అర్హులైన ప్రతి లబ్దిదారునికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు.

తాండూరు ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలోని పేదలు రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. కొత్త కార్డులు రాకపోయినా లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆంజనేయులు, తుమ్మనపల్లి మాణిక్యం, యువకులు సిహెచ్ మొగులప్ప, ప్యాట్ల బాలప్ప, బీజే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

