మహిమాన్వితురాలు కట్టమైసమ్మ

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిమాన్వితురాలు కట్టమైసమ్మ
– తల్లి సన్నిధిలో అన్నదానం అభినందనీయం
– తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– దర్శించుకున్న వినాయక స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలో వెలసలిన కట్ట మైసమ్మ తల్లి ఎంతో మహిమాన్వితురాలు అని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అన్నారు. శనివారం అమావాస్య సందర్భంగా తాండూరుకు చెందిన అలంపల్లి ప్రకాష్ దంపతుల సహాకారంతో 29వ సారి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి విఠల్ నాయక్ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి డా. చందునాయక్, వైద్య బృందంతో కలిసి హాజరయ్యారు. ముందుగా దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు వారి చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతకుం టలో వెలసిన కట్ట మైసమ్మ ఎంతో మహిమాన్వితురాలు, గట్టి సంకల్పంతో అమ్మవారిని వేడుకుంటే కోరిన పనులు జరుగుతాయన్నారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు సంజీవరావు, సుభాష్, నర్సింలు, వేణు, సుధాకర్, నాగప్ప, శ్యాంప్రసాద్, రాములు, జే.సుధాకర్, మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇంట్లో నుంచే ఆస్తిపన్నులు…!