సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– 169 మందికి ఎల్వోసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు చెందిన 169 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 70లక్షల 20వేలు మంజూరయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఎలసీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురై వైద్య ఖర్చులు భరించలేని పేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కోట్పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, నాయకులు గాజీపూర్ నారాయణ రెడ్డి, వడ్డె శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి. అజయ్ ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్లు జర్నప్ప, ఉదయ్ భాస్కర్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి….

