భద్రేశ్వరుని సేవలో తాండూరు సబ్ కలెక్టర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వరుని సేవలో తాండూరు సబ్ కలెక్టర్..!
– దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఉమాశంకర్ ప్రసాద్
– రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన, సన్మానించిన చైర్మన్ పటేల్ కిరణ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరుని సేవలో స్థానిక సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తరించారు. జాతర ఉత్సవాలో భాగంగా శనివారం ఆయన భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించారు.

దేవాలయంలో వెలసిన స్వామికి సబ్ కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌ ను దేవాలయ రెనవేషన్ కమిటి సభ్యులు పటేల్ కిరణ్‌ కుమార్ ఆలయ కమిటి సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం సబ్ కలెక్టర్ జాతర ఉత్సవాలలో భాగంగా నిర్వహించబోతున్న రథోత్సవ వేడుక ఏర్పాట్లను సమీక్షించారు.

తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డితో కలిసి ఏర్పాట్లపై ఆరా తీశారు. రథోత్సవం బయల్దేరే స్థలం నుంచి బసవణ్ణ కట్ట వరకు నడుచుకుంటూ వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్‌ కుమార్, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

ఆపద్భాందవులు అంబులెన్స్ సిబ్బంది..!