రసూల్ పూర్ భక్తులకు చేయూత
– లయన్స్ క్లబ్ ద్వారా వాటర్ ట్యాంకు వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ శివారు రసూల్ పూర్ అభయాంజనేయ దేవాలయ భక్తులకు స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు చేయూత అందించారు. శుక్రవారం తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప, సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయానికి లయన్స్ క్లబ్ తరుపున వాటర్ ట్యాంక్ అందజేశారు.

ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ రసూల్ పూర్ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ఆలయంలో వారికి మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని దేవాలయ సభ్యులు కోరడం జరిగిందని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు లయన్స్ క్లబ్ తరుపున దేవాయాలనికి వాటర్ ట్యాంక్ అందజేయడం జరిగిందని తెలిపారు.

దీంతో దేవాలయానికి వచ్చే భక్తులకు మంచినీటి కష్టాలు తీరుతాయని అన్నారు. దేవాలయ భక్తుల కోసం తమ వంతు సహాకారం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి నటరాజ్, సీనయర్ సభ్యులు సల్లా దామోదర్, ఓంప్రకాష్ సోమాని, బసనప్ప, పసారం బస్వరాజ్, కట్కం వీరేందర్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

