తాండూరు స్టోన్‌ మర్చంట్స్‌, క్వారీ ఓనర్స్‌కు ఎన్నికలు

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు స్టోన్‌ మర్చంట్స్‌, క్వారీ ఓనర్స్‌కు ఎన్నికలు
– రెండు అసోసియేషన్లకు అధ్యక్షులుగా నయూం, అబ్దుల్ రవూఫ్‌
– ఏకగ్రీవంగా ఇరు అసోసియేషన్ల అధ్యక్షుల ఎన్నిక
– ప్రధాన కార్యదర్శులుగా కుంచెం మురళిధర్, జుబేర్ లాల

తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ది తాండూరు స్టోన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్, ది తాండూరు మండల క్వారీ ఓనర్స్‌ వెల్పేర్ అసోసియేషన్ల కార్యవర్గం ఎన్నిక పూర్తయ్యింది. గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని స్టోన్ భవన్‌లో ఎన్నికలు నిర్వహించారు.
kvcs
ఈ రెండు అసోసియేషన్లకు 2025- 2028 సంవత్సరానికి కార్యవర్గంకు ఎన్నికలు జరిగాయి. స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి మహమ్మద్ నయూం(అఫ్పూ), మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రవూఫ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా స్టోన్ మర్చంట్స్‌ వెల్పేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎంఏ సత్తార్, విజయ రమణ రావు, ప్రధాన కార్యదర్శిగా కుంచెం మురళిధర్, సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ హబీబ్, బ్రిజ్ మోహన్ బూబ్, కోశాధికారిగా సంజీవ్ కుమార్‌లను ఎన్నుకున్నారు.

అదేవిధంగా మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఓం ప్రకాష్ సోమాని, మహమ్మద్ అన్వర్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ జుబేర్ లాల, సంయుక్త కార్యదర్శులుగా శరణు బసప్ప, హర్షవర్దన్ రెడ్డి, కోశాధికారిగా మహమ్మద్ జైనుద్దీన్‌లను ఎన్నుకున్నారు. వీరితో పాటు ఆయా అసోయేషన్లతో మెంబర్లను ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులకు, కార్యవర్గానికి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు నయూం(అఫ్పూ), అబ్దుల్ రవూఫ్‌లు మాట్లాడుతూ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఇదికూడా చదవండి…

బ్యాంకులో కుంభకోణం..!