సేవా మార్గంలో నడవండి..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సేవా మార్గంలో నడవండి..!
– బచ్‌పన్‌ ట్రస్ట్ రక్తదానం అభినందనీయం
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరు సమాజంకు మంచి జరిగే సేవా మార్గంలో నడవాలని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అభిలాషించారు.
kvcs
ఆదివారం తాండూరుకు చెందిన పదో తరగతి 98-99 బ్యాచ్ బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని జేబీ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజుగౌడ్ హాజరై రక్తదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బచ్ పన్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత రక్తదానంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

విద్యాదానంకు, పేద విద్యార్థుల విద్యకు తోడ్పాటు అందించాలన్నారు. దేశంలో అందరి అభివృద్ధి కోసం సేవా మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యూనుస్ ఖాన్, ట్రస్టు చైర్మన్ మోహన్ కృష్ణ గౌడ్, నయూం, గౌరవ అధ్యక్షులు రంజిత్ కుమార్, అధ్యక్షులు ఎం.ఏ మతీస్, ఉపాధ్యక్షులు గాయత్రి, ప్రధాన కార్యదర్శి రవికుమార్, సంయుక్త కార్యదర్శి విజయానంద్, కోశాధికారి తయాబ్ ఈర్షాద్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ జుబైర్ ఉద్దీన్, అభిషేక్, రూ. పద్మావతి, సభ్యులు కిషన్ గోపాల్ రాఠి, సన్ని అగ్రవాల్, సంతోష్ కుమార్, అరుణ్ కుమార్, ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

టోల్‌ గేట్‌ను ఫ్రీగా దాటేయొచ్చు..!