రాముని గుడికి రూ.50వేల విరాళం
– తండ్రి జ్ఞాపకార్థం అందించిన కుమారుడు
– ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని రామ మందిరంకు ఓ కుమారుడు రూ. 50వేల అందజేశారు. గత కొన్ని నెలలుగా ఇందిరానగర్ లోని రామ మందిర పునర్ నిర్మాణం జరుగుతోంది.

ఇందులో భాగంగా దేవాలయ పునర్ నిర్మాణం కోసం గొట్టిగ యుగేందర్ అనే వ్యక్తి ఆయన తండ్రి స్వర్గీయ గొట్టిగ సురేష్ జ్ఞాపకార్థం రూ. 50వేల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణంలో భక్తులు భాగస్వామ్యం కావాలని కోరారు. నిర్మాణం కోసం వస్తు రూపేణ, నగదు రూపంలో అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

