కల్తీ అల్లం.. గుట్టు రట్టు..!
– 196 కిలోల పేస్ట్ స్వాధీనం
– ఇద్దరి నిందితులపై కేసులు
– టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి
– అల్లం పేస్ట్ ఎలా రెడి చేశారో తెలిస్తే షాక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారులు తమ స్వార్థం కోసం మార్కెట్లో వస్తువులతో పాటు ఆహార పదార్థాలను కూడా కల్తీ చేస్తున్నారు. తాండూరులో కల్తీ అల్లం పేస్ట్ విక్రయాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఈ దాడుల్లో కల్తీ అల్లం పేస్ట్ విక్రయాల గుట్టు రట్టయ్యాయింది. ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు 196 కేజీల కల్తీ అల్లం పేస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం జిల్లా ట్కాస్ ఫోర్స్ ఇనుస్పెక్టర్ అన్వర్ పాష, బృందం దాడులు నిర్వహించారు. ఈక్రమంలో పట్టణంలోని మర్రిచెట్టు కూడలి సమీపంలోని మణికంఠ కిరాణాషాపులో యజమాని పోల వీరణ్ణ వద్ద కల్తీ అల్లం పేస్ట్ విక్రయాలను గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని పేస్ట్ ఎక్కడి నుంచిస్తుందని విచారింగా హైదరాబాద్‌లోని అసిఫ్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నట్లు యజమాని వీరణ్ణ తెలిపారు. పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు.

196 కేజీల కల్తీ అల్లం స్వాధీనం
మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఇద్దరి నిందితుల నుంచి 196 కేజీల కల్తీ అల్లం పేస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. మణికంఠ కిరాణం యజమాని పి. వీరన్న వద్ద నుంచి 30 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకోగా.. ఇందులో 500 గ్రాముల బాటిళ్లు 38, 200 గ్రాముల బాటిళ్లు 48, మరియు 100 గ్రాముల బాటిళ్లు 25 ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ ఆసీఫ్ నగర్లో ఇమ్రాన్ వద్ద సుమారు 166 కిలోల నకిలీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 కిలోల బాటిళ్లు 32, 1 కిలో బాటిళ్లు 6 ఉన్నాయి. అదనంగా 30 కిలోల కల్తీ అల్లం రెండు బస్తాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రసాయనాలతో పేస్ట్ తయారి
అధికారులు స్వాధీనం చేసుకున్న అల్లం పేస్ట్‌ను ఎలా కల్తీ చేశారో విచారించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్ లో హానికరమైన రసాయనాలు, కృత్రిమ రంగులు వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కల్తీ పేస్ట్ ను ఆహార పదార్థాల్లో వాడడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు.
పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం తాండూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ నకిలీ సరుకు ఎక్కడ తయారు అవుతుంది, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కల్తీ ఆహార ఉత్పత్తుల నివారణఖు భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగుతాయని, ఎవరైనా కల్తీ వ్యవహారాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

