న్యూఇయర్ జరుపుకోవద్దు..!

తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

న్యూఇయర్ జరుపుకోవద్దు..!
– మన ఉగాది పండగే ముద్దు
– విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి వినోద్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆంగ్ల సంవత్సరం న్యూఇయర్ జరుపుకోవద్దని, మన ఉగాది పండగే కొత్త సంవత్సరంగా జరపుకోవాలని విశ్వహిందూ పరిషత్ తాండూరు ప్రతినిధి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకునే న్యూ ఇయర్ అనే వేడుకల్లో వాతావరణం లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. హైందవ సోదరులందరికీ ఉగాది నూతన సంవత్సరమని, ఉగాది అంటే యుగమునకు ఆది యుగానికి తొలి రోజు అని అన్నారు.

ఇది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది అని తెలిపారు. కావున హైందవ సోదరులందరికీ నూతన సంవత్సరం ఉగాది అని ఆరోజు కొత్త బట్టలు ధరించి, షడ్రుచులు కలిగిన పచ్చడిని సేవించినప్పుడే నూతన సంవత్సరమన్నారు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం పేరిట మద్యం సేవించి కేకులు కట్ చేసే విష సంస్కృతిని విడాలని కోరారు.

ఇదికూడా చదవండి…

తాండూరు సబ్‌ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు..!