శ్రీరామ మందిరానికి విరాళం..!
– ఆర్థిక సాయం అందించిన నాగారం మల్లేశం
– బీజేపీ పట్టణ అధ్యక్షునికి కమిటి సభ్యుల కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ శ్రీరామ మందిరానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు విరాళం అందించారు. గత కోన్ని రోజులుగా ఇందిరానగర్లో శ్రీరామ మందిర దేవాలయ పునర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

దేవాలయ పునర్ నిర్మాణం కోసం దాతలు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం రూ. 51వేల విరాళం అందించారు. దేవాలయ పునర్ నిర్మాణంలో భాగస్వామి కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా దేవాలయ పునర్ నిర్మాణానికి విరాళం అందించడం పట్ల దేవాలయ కమిటి సభ్యులు నాగారం మల్లేశంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి దేవాలయ పునర్ నిర్మాణానికి సహాకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

