అభివృద్ది, సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అభివృద్ది, సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..!
– తాండూరును భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్సే
– అధికారం కోసం కాంగ్రెస్ పార్టీపై దుష్ర్పచారం
– పట్టణ సమస్యలు తీర్చే బాధ్యత మాదే
– చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ కార్నర్‌ మీటింగ్‌లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమే జోడెద్దుల మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోందని తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్‌ గుండుపీర్ల వద్ద 1, 2, 3, 4, 5, 6, 7, 24, 25వ వార్డులకు సంబంధించి కార్నర్‌ మీటింగ్‌లు అట్టహాసంగా జరిగాయి.

ఈ కార్యక్రమాలకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు ఇద్దరు కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామిలను నేరవేర్చడం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో తాండూరును భ్రష్టు పట్టించారని అన్నారు. ఐదేళ్లు మహిళ చైర్మన్ అవమానించింది వీళ్లు కాదా అని ప్రశ్నించారు. అధికారం కోసం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాండూరు యువతను చెడు అలవాట్లకు బానిస చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు.

మున్సిపల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తుకు ఓటు గెలిపించాలని కోరారు. ఎన్నికల తరువాత మున్సిపల్‌లో డబుల్‌ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. తాండూరు కాగ్నానది నుంచి పట్టణానికి రెండు పూటలా తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. గొల్ల చెరువు, చిలుకవాగులను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. తాండూరుకు 500 ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు రేషన్ కార్డులు, మహిళలకు వడ్డిలేని రుణాలు, పంపిణీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. పార్టీ అభ్యర్థులను గెలిపించి వార్డులను మరింత అభివృద్ధి చేసుకునేందుకు చేతి గుర్తుకు ఓటు వేసి తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, డీసీసీ ప్రచార కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్‌, ముజీబ్ ఖాన్, జుబేర్ లాల, వడ్డె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌, కౌన్సిలర్ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

హస్తం అభ్యర్థుల గెలుపుకు అండగా బీఎస్ఆర్..!