పట్టణాభివృద్ధికి కృషి చేయండి..!
– బీఎస్‌ఆర్‌ను కలిసిన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
– అభినంధించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– సన్మానించి ధన్యవాదాలు చెప్పిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌లకు సూచించారు.

మంగళవారం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళారెడ్డిలను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి శాలువా, పూల మాలలవేసి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కొత్త చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

మరోవైపు నూతన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ లు ప్రజల విశ్వాసంతో సాధించిన ఈ విజయాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. తమ గెలుపులో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకం ఉందని అన్నారు. ఇందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్ పోలీస్ బాలకృష్ణ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


