వాడి ప్యాసింజర్ టైమింగ్ మార్చండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వాడి ప్యాసింజర్ టైమింగ్ మార్చండి..!
– రైల్వే జీఎంకు ప్రయాణికుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మీదుగా రవాణా సర్వీసులు అందిస్తున్న వాడి ప్యాసింజర్ టైమింగ్‌ను మార్చాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాస్తవను కోరారు.

మంగళవారం వికారాబాద్ కు వచ్చిన జీఎంను తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బాబ్యానాయక్, జనార్దన్ టీచర్, రైల్వే ప్రయాణికులు కలిశారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉన్న వాడి ప్యాసింజర్ టైమ్ 3గంటలకు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని జీఎం దృష్టికి తీసుకవెళ్లారు. దానిని 4-30గంటలకు మార్చి ఇబ్బందిని తొలగించేలా చూడాలని కోరారు. ఇందుకు రైల్వే జీఎం శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

విద్యపై నిర్లక్ష్యం చేయోద్దు